Save the Tigers : టైగర్స్ వేటలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 4లోకి టాలీవుడ్ స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ రంగంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించగా.. ఇప్పుడు మేకర్స్ అంతకుమించిన భారీ ప్లాన్‌తో నాలుగో సీజన్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు షురూ చేశారు. ఇటీవలే జూన్ 19న విడుదలైన ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి, తొలి రెండు సీజన్ల పంథాలోనే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్ హ్యాట్రిక్ సక్సెస్‌తో షో రన్నర్ మహి వి. రాఘవ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఇప్పుడు సీజన్ 4ను మరింత గ్రాండియర్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ నాలుగో భాగంలో టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోను రంగంలోకి దించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నిరంతరం గొడవలు పడే ఆ ముగ్గురు మొగుళ్లు, పెళ్లాల మధ్యలోకి ఈ స్టార్ హీరో క్యారెక్టర్ ఎలా ఎంట్రీ ఇస్తుంది? ఆయన పాత్ర సిరీస్‌ను ఏ మలుపు తిప్పబోతోంది? అనే ఆసక్తి నెటిజన్లలో ఇప్పుడే పీక్స్‌కు చేరింది. ప్రస్తుతం సదరు స్టార్ హీరోతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ప్రేక్షకుల నుండి లభించిన అద్భుతమైన ఆదరణను కాపాడుకుంటూ, నాలుగో సీజన్‌తోనూ అదే సక్సెస్ గ్రాఫ్‌ను కంటిన్యూ చేసేలా స్క్రిప్ట్ విషయంలో రైటర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథలో ఎక్కడా హ్యూమర్ మిస్ కాకుండా, భారీ తారాగణంతో ఈ ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించబోతున్నారు. ఈ క్రేజీ సీజన్ 4కి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలను, ఆ స్టార్ హీరో ఎవరనే సస్పెన్స్‌ను మేకర్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారు.
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!