NTV Telugu Site icon

Satyadev: విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం కాదు అని చెప్పే కథే ‘కృష్ణమ్మ’: సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview

Satyadev Interview

Satyadev Interview for Krishnamma Movie: స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన ‘కృష్ణ‌మ్మ‌’ సినిమాను ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. . వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో ‘కృష్ణమ్మ’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

కృష్ణమ్మ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
ఈ సినిమాలో అందరూ ఓకే అయ్యాక నేను చివర్లో వచ్చాను. శివకి నచ్చి ప్రజెంటర్, కాలభైరవ కూడా వచ్చారు. చివర్లో హీరోగా నేను వచ్చా. డైరెక్టర్ గోపాలకృష్ణ నిర్మాత కృష్ణకి కథ చెప్పి ఒప్పించారు. ఆ కథని కృష్ణ శివకి వినిపిస్తే నచ్చి ప్రజెంటర్ గా మారారు.

ట్రైలర్ చూస్తే పోలీసులు, రౌడీల మధ్య జరిగే కథని తెలుస్తుంది. కృష్ణ, విజయవాడ అంటే పాలిటిక్స్ ఇవన్నీ వినిపిస్తాయి కదా?
విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు, కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితంలో, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. కానీ అలాంటి డ్రీమ్ చెడగొడితే వాళ్ళు ఏం చేశారు అనేది ఉంటుంది. దీంట్లో రౌడీయిజం, పాలిటిక్స్ ఏం ఉండదు.

పాత్ర కోసం మీరు ఎలా కష్టపడ్డారు? ఇది రియల్ క్యారెక్టరా?
వించిపేట భద్ర అనే క్యారెక్టర్ కోసం, విజయవాడ స్లాంగ్ కోసం, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ల వ్యక్తిగా, పొగరు, పగ.. ఇలాంటివి అన్ని చూపించాలి కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్. ఇక ఇది రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకొని ఫిక్షనల్ గా రాసుకున్న పాత్ర, కథ.

ట్రైలర్‌లో ఒక షాట్ లో మొక్కని నాటుతూ ఒకర్ని కొడతారు, కొత్తగా ఉంది. ఆ సీన్ గురించి చెప్పండి?
సినిమాలో అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న సీన్. రివెంజ్ మర్చిపోతామేమో అని ఒక మొక్క పెంచుకుంటారు సినిమాలో. ఆ మొక్క ఎంత పెరిగితే పగ అంత పెరుగుతుంది. మొక్క నుంచి వృక్షం వరకు డైరెక్టర్ చాలా బాగా రాసారు. అది సినిమాలో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి.
గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేశారు. మళ్ళీ అలాంటి పాత్రలు చేస్తారా?

గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారికి ఆపోజిట్ గా చేశాను. రామసేతులో అక్షయ్ కుమార్ గారి పక్కన చేశాను. మళ్ళీ ఆ రేంజ్ పాత్రలు రాలేదు. ఇలాంటివి చాలా క్యారెక్టర్స్ అడిగారు కానీ ఆ పాత్రలకు కనీసం సమానంగా ఉండే పాత్రలు రాలేదు అందుకే చేయలేదు. మంచి పాత్రలు వస్తే చేస్తాను. రామసేతు తర్వాత హిందీలో కూడా ఛాన్సులు వస్తున్నాయి కానీ మంచి పాత్ర కోసం చూస్తున్నాను. తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో చేస్తానేమో. ఇక వెబ్ సిరీస్ లు గతంలో గాడ్, లాక్డ్.. చేసాను, మళ్ళీ వస్తే కూడా చేస్తాను.

Show comments