కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా పేరొందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలను విజయవంతంగా నిర్మించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ కానుంది. ఇడ్లీ కడైలో ముఖ్య పాత్రలో నటించిన సత్యరాజ్, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read : Mohanlal: ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్
మలయాళ అగ్ర నటుడు, రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి లో కట్టప్ప గా గుర్తింపు పొందిన సత్యరాజ్, ఈసారి ధనుష్ సినిమాతో వర్క్ చేయడం అనుభవాన్ని పంచుకున్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘రాజమౌళి, ధనుష్ ఇద్దరి వర్క్ స్టైల్‌ను పోల్చితే, ధనుష్ తో వర్క్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్‌గా ధనుష్‌కు ఉన్న స్పష్టత, క్లారిటీ అతన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది. ధనుష్ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, ఇటీవల యాక్షన్ సినిమాలనే ఎక్కువగా చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక తాజా అనుభవం ఇస్తుంది’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యల ధనుష్ ప్రత్యేక వర్క్ స్టైల్ చూపించే గౌరవాన్ని ‘ఇడ్లీ కడై’ సినిమా పట్ల ఉన్న ఆసక్తి మరింత పెంచాయి. కాగా ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
