Site icon NTV Telugu

Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం

Satya

Satya

Sathyaraj: కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి మరణవార్త విన్నవెంటనే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కు పయనమైనట్లు సమాచారం. నతంబాల్ కు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్.. కుమార్తెలు కల్పన, రూప. ఇక సత్యరాజ్ కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం ఇష్టం అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్.. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపాడు. “నటుడు సోదరుడు శ్రీ సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణవార్త విని బాధపడ్డాను. అమ్మయ్యర్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సోదరుడు సత్యరాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశాడు.

Meenakshi Dixit: మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలిలో కట్టప్ప పాత్రలో ఆయన నటించి మెప్పించాడు. ఆ సినిమా తరువాత నుంచి ఆయనను కట్టప్ప అనే పిలవడం మొదలుపెట్టారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో సత్యరాజ్ ముఖ్య పత్రాలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కొడుకు శిబి సత్యరాజ్ సైతం కోలీవుడ్ లో హీరోగా సెటిల్ అయ్యాడు. ఇక ఈ విషయం తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు సైతం సత్యరాజ్ కు సానుభూతి తెలుపుతున్నారు.

Exit mobile version