Site icon NTV Telugu

Sathya Dev: మేము బాలయ్య ఫాన్స్… బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తాం

Sathya Dev

Sathya Dev

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ కి కేరాఫ్ అడ్రెస్. ఈ జనరేషన్ చూసిన బెస్ట్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకడు. ఎప్పుడూ సీరియస్ సినిమాలు, ఇంటెన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేసే సత్యదేవ్… చాలా రోజుల తర్వాత తన వెర్సటాలిటీ చూపించడానికి, తనలోని నటుడిని ఒక కొత్తగా పరిచయం చెయ్యడానికి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ తో సత్యదేవ్ ఆటో డ్రైవర్ గా ఈ మూవీలో నటిస్తున్నాడు. ‘మెర్క్యూరీ సూరి’ అనే క్యారెక్టర్ లో సత్యదేవ్ మంచి జోష్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఫుల్ బాటిల్ టైటిల్, మెర్క్యురీ సూరి క్యారెక్టర్ పేరు అనగానే సత్యదేవ్ ఈసారి ఎదో కొత్తగా చెయ్యబోతున్నాడు అనే విషయం అర్ధమవుతోంది.

శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. గతంలో సత్యదేవ్, శరన్ కాంబినేషన్ లో ‘తిమ్మరుసు’ సినిమా వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఇంతకన్నా ముందు శరన్, నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాని డైరెక్ట్ చేసాడు. కిరాక్ పార్టీలో శరన్ ఫన్ ని బాగా క్యారీ చేసాడు. ఇప్పుడు ఫుల్ బాటిల్ సినిమాలో కూడా సత్యదేవ్ తో ఫుల్ కామెడీ చేయించడనే విషయం టీజర్ తోనే అర్ధమయ్యింది. తాగుబోతుగా సత్యదేవ్ భలే యాక్టివ్ గా కనిపించాడు, అతనిలోని ఈజ్ బాగుంది. సత్యదేవ్ చాలా కొత్తగా రిఫ్రెషింగ్ గా కనిపించాడు. సత్యదేవ్, బ్రహ్మాజీల ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా టీజర్ లో ‘మేము బాలయ్య ఫాన్స్… బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తాం’ అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా ఉంది. ఫన్ తో పాటు కాస్త సీరియస్ యాంగిల్ కూడా ‘ఫుల్ బాటిల్’ టీజర్ లో కనిపిస్తోంది. మరి ఈ యాంగిల్ లో సత్యదేవ్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి, టీజర్ వరకూ అయితే మంచి మార్కులే కొట్టేసాడు.

Exit mobile version