Sathya Dev: ఎప్పుడు ఆ సీరియస్ సినిమాలు ఏం చేస్తావ్ బాసూ… కాస్త నవ్వు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్… ఇంటర్ నిబ్బి పైన ఉన్నన్ని ఫన్నీ మీమ్స్ ఇంకో టాపిక్ పైన ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ ని, ప్రేమ కవితలని ఆటో పైన వేసుకోని, ఫుల్ సౌండ్ పెట్టుకోని క్రేజీగా తిరుగుతూ ఉంటారు కొందరు ఆటో డ్రైవర్స్. స్టైల్, స్వాగ్ ని మైంటైన్ చెయ్యడంలో వీళ్లు ముందుంటారు. ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని చెయ్యడానికి రెడీ అయ్యాడు సత్యదేవ్. ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ ఉన్న సత్యదేవ్ సినిమాలు అనగానే సీరియస్ మూవీస్ గుర్తొస్తాయి. ఎక్కువగా ఇంటెన్స్ నటన ప్రెజెంట్ చెయ్యగల స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ని మాత్రమే చేసిన సత్యదేవ్ ఈ జనరేషన్ చూసిన వర్సటైల్ యాక్టర్స్ లో ఒకడు. తన వెర్సటాలిటీ చూపించడానికి, తనలోని నటుడిని ఒక కొత్తగా పరిచయం చెయ్యడానికి సత్యదేవ్ చేస్తున్న సినిమా ‘ఫుల్ బాటిల్’. సత్యదేవ్ ఆటో డ్రైవర్ గా నటిస్తున్న ఈ మూవీలో అతని క్యారెక్టర్ పేరు ‘మెర్క్యూరీ సూరి’. ఫుల్ బాటిల్ టైటిల్, మెర్క్యురీ సూరి క్యారెక్టర్ పేరు అనగానే సత్యదేవ్ ఈసారి ఎదో కొత్తగా చెయ్యబోతున్నాడు అనే విషయం అర్ధమవుతోంది.
ఈ మూవీని శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో సత్యదేవ్, శరన్ కాంబినేషన్ లో ‘తిమ్మరుసు’ సినిమా వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఇంతకన్నా ముందు శరన్, నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాని డైరెక్ట్ చేసాడు. కిరాక్ పార్టీలో శరన్ ఫన్ ని బాగా క్యారీ చేసాడు. ఇప్పుడు ఫుల్ బాటిల్ సినిమాలో కూడా ఫన్ ని సత్యదేవ్ తో చేయించడానికి రెడీ అయ్యాడు. ఫుల్ బాటిల్ సినిమా కోసం సత్యదేవ్ ఎలా ప్రిపేర్ అయ్యాడు అనేది చూపిస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేసారు. ఇందులో సత్యదేవ్ సీరియస్ గా శరన్ చెప్పే కథని వింటూ ఉంటే… కాస్త నవ్వు బ్రో అని చెప్తూ శరన్ ‘మెర్క్యూరీ సూరి’ క్యారెక్టర్ ని పరిచయం చేసిన విధానం బాగుంది. మే 27న సాయంత్రం 5:30 నిమిషాలకి ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ తో సత్యదేవ్ సాలిడ్ చేంజోవర్ చూపిస్తాడేమో చూడాలి.
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Preparation Ayiepeyindhi 🤙
Inka Presentation ye 🥳Preparation of #MercurySoori meekosam 😉
▶️ https://t.co/bfZRb5pTDWBringing you #FullBottleTeaser on May 27th, 5:30PM.
Stay tuned 🤗@itssanjanaanand @sharandirects @actorbrahmaji @SRCOffl @SDCompanyOffl @vamsikaka pic.twitter.com/L5rnHVTX4m— Satya Dev (@ActorSatyaDev) May 25, 2023
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!