Site icon NTV Telugu

Sasivadane Teaser: విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త లవ్ స్టోరీ.. శశివదనే

Sasi

Sasi

Sasivadane Teaser: పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా నటిస్తోన్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా శశివదనే, డీజే పిల్లా అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

టీజర్‌ను గమనిస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథలా కనిపిస్తుంది. రక్షిత్ అట్లూరి, కోమలీ కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. అదేంటనేది మాత్రం తెలియకుండా దర్శక నిర్మాతలు సీక్రెట్‌ను మెయిన్‌టెయిన్ చేయటం చూస్తుంటే సినిమాలో హై మూమెంట్ ఏదో ఉందనే ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న శశివదనే చిత్రం ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రక్షిత్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version