NTV Telugu Site icon

ఆర్య ‘సార్పట్ట’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

కోలీవుడ్ హీరో ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సార్పట్ట’.. తుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా. రంజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, తమిళ ట్రైలర్‌ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. కె9 స్టూడియో పతాకంపై షణ్ముగం దక్షన్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా నిర్మించారు. ఆర్యతో పాటు తుషారా, కలైయరసన్‌, పశుపతి, జాన్‌ విజయ్‌, కాళి వెంకట్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం జూలై 22న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

Sarpatta Parampara - Official Trailer | Arya, Kalaiyarasan, Pasupathi, Dushara | Amazon Prime Video