సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 15 కోట్ల “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఒకే ఒక్క టీజర్ తో సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలను క్రియేట్ చేశాడు మహేష్. సూపర్ స్టార్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. ఈ అప్డేట్ మహేష్ అభిమానులను నిరాశ పరిచింది. కాగా 2022 ఏప్రిల్ 1న “సర్కారు వారి పాట” కొత్త రిలీజ్ డేట్ గా ఖరారు చేశారు మేకర్స్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్

SVP