సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. గోవాలోని ఓ బీచ్ లో మాస్ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట.
Read Also : ఐఐఎఫ్ఎం 2021 అవార్డ్స్ : ఉత్తమ నటిగా సమంత
ఇక కరోనాకు ముందు “సర్కారు వారి పాట” షూటింగ్ ను దుబాయ్ లో చిత్రీకరించారు. ఆ సమయంలో మేకర్స్ స్వయంగా ఫోటోలు విడుదల చేశారు. అదే సన్నివేశాన్ని ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్”లో చూపించారు. ఆ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. దీంతో ఇప్పుడు గోవా బీచ్ లోని యాక్షన్ సన్నివేశాలు కూడా థియేటర్లలో ఈలలు వేయిస్తాయని మహేష్ అభిమానులు అంటున్నారు. మరోవైపు “సర్కారు వారి పాట” టీజర్ రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. ఇప్పుడు “సర్కారు వారి పాట” టీజర్ 33 మిలియన్ల వ్యూస్ దాటేసి.950కే వ్యూస్ తో కొనసాగుతోంది.
