NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: తొలి రోజు కుమ్మేసిన సర్కారు వారు

Sarkaru Vaari Paata 1

Sarkaru Vaari Paata 1

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో వీకెండ్ వరకు ఈ సినిమాకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా రూ.36.63 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వెండితెరపై మహేష్ బాబు సినిమా విడుదలై రెండు సంవత్సరాల నాలుగు నెలలు దాటింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ ఎనర్జిటిక్, స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించడంతో అతడిని చూసేందుకు అభిమానులు సర్కారు వారి పాట సినిమాకు బారులు తీరుతున్నారు. మరోవైపు మహేష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, కామిక్ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ‘నాన్ రాజమౌళి'(బాహుబలి, ఆర్.ఆర్.ఆర్) సినిమాల్లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది.

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమాలో ‘భీమ్లా నాయక్’

తొలిరోజు ఏపీ, తెలంగాణలో సర్కారు వారి పాట మూవీ షేర్లు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. గుంటూరులో రూ.5.83 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.73 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.3.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3 కోట్లు, కృష్ణాలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.