Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్

Sarkaru Vaari Paata 100cr

Sarkaru Vaari Paata 100cr

ఈ గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’కు సర్వత్రా పాజిటివ్ టాక్‌ రావడంతో.. ఇది బాక్సాఫీస్‌పై తాండవం చేస్తోంది. ఫలితంగా.. రెండో రోజుల్లోనే రూ. 100 కోట్ల (గ్రాస్) క్లబ్‌లోకి చేరిపోయింది. తమ సినిమా రెండు రోజుల్లోనే రూ. 103+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని, స్వయంగా చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా ధృవీకరించింది. దీంతో, రెండు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి రీజనల్ సినిమాగా ‘సర్కారు వారి పాట’ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. షేర్ విషయానికొస్తే.. రూ. 48.27 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

అటు, యూఎస్‌లోనూ ఈ సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఆల్రెడీ $1.5 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. మహేశ్ బాబు స్వాగ్‌ను వెండితెరపై ఆస్వాదించేందుకు సినీ ప్రియులందరూ థియేటర్లకు తరలి వస్తుండడం వల్ల.. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. ఈ వీకెండ్‌లోనే ‘సర్కారు వారి పాట’ మరిన్ని ఘనతలు సాధించొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. కమెడియన్‌గా వెన్నెల కిశోర్ మరోసారి తన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. సముద్రఖని విలన్‌గా ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు.

Exit mobile version