Site icon NTV Telugu

బిడ్డింగ్ నేప‌థ్యంపై ‘ఆహా’ స‌రికొత్త గేమ్ షో ‘స‌ర్కార్‌’!

Sarkaar Game Show On AHA Premieres October 28th

Sarkaar

బిడ్డింగ్ నేప‌థ్యంపై డిజిట‌ల్ మాధ్య‌మంలో మొట్టమొదటిసారి రూపొందిన స‌రికొత్త గేమ్ షో ‘స‌ర్కార్‌’. ‘మీ పాటే నా ఆట’ అనేది దీని ట్యాగ్ లైన్. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ గేమ్ షో అక్టోబ‌ర్‌ 28నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. టాలీవుడ్‌లోని సెల‌బ్రిటీలంద‌రూ ‘స‌ర్కార్‌’ గేమ్ షోలో పాల్గొని వారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. డిఫ‌రెంట్ స్టైల్‌, ఎన‌ర్జీ, థ్రిల్, ఫ‌న్, ఎగ్జ‌యిట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ‘సర్కార్’ గేమ్ షో తొలి ఎపిసోడ్ అక్టోబ‌ర్‌ 28 సాయంత్రం 8 గంట‌ల‌కు ఆహాలో ప్ర‌సారం అవుతుంది. అలాగే ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఈ గేమ్ షో ప్రేక్షకులను మెప్పించనుంది. దర్శకుడు నటుడు త‌రుణ్‌భాస్క‌ర్‌, విశ్వ‌క్ సేన్‌, అన‌న్య నాగ‌ళ్ల, అభిన‌వ్ గోమ‌టం స‌హా ప‌లువురు ప్ర‌ముఖులంద‌రూ ఈ గేమ్ షోలో భాగమ‌వుతున్నారు.

Read Also : జాతీయ పురస్కారాలు అందుకున్న మామఅల్లుడు!

‘స‌ర్కార్‌’ ప్రతి ఎపిసోడ్‌లో నాలుగు లెవ‌ల్స్ ఉంటాయి. ప్ర‌తి లెవ‌ల్‌లో పార్టిసిపెంట్స్ మూడు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్ర‌తి పార్టిసిపెంట్ స‌మాధానం కోసం వేలం పాట‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారో వారే ఆ ఆన్స‌ర్‌ను సొంతం చేసుకుంటారు. స‌రైన స‌మాధానం చెప్పే ప్ర‌తిసారి అంత‌కు ముందు వారు గెలుచుకున్న మొత్తం రెండింత‌లు కావ‌డం, మూడింత‌లు కావ‌డం, ఆరింత‌లు కావ‌డం ..ఇలా మూడు నాలుగు లెవ‌ల్స్ వ‌ర‌కు గేమ్ కొన‌సాగుతుంది. ప్ర‌తి లెవ‌ల్‌లో త‌క్కువ మొత్తంలో డ‌బ్బుల‌ను క‌లిగి ఉన్న పార్టిసిపెంట్ గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతాడు. వెళ్లిపోయేవారు గేమ్‌లో కొన‌సాగుతున్న త‌మ‌కు న‌చ్చిన వారికి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫ‌ర్ చేసే సౌల‌భ్యం ఉంటుంది. ఫైన‌ల్‌కు చేరుకున్న ఇద్ద‌రి పార్టిసిపెంట్స్‌లో మూడు ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రైతే త‌క్కువ స‌మ‌యంలో స‌మాధానాలు చెప్పి ఉంటారో వారే గేమ్‌లో గెలిచిన‌ట్టు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌, మైథాల‌జీ, మ్యాథ‌మాటిక్స్ వంటి సబ్జెక్స్‌పై ప్ర‌శ్న‌ల‌ను అడుగుతారు. ప్ర‌తి ప్ర‌శ్న‌ను వేసే ముందు హోస్ట్ ఏ టాపిక్ నుంచి ప్ర‌శ్న వేస్తున్నారనే విష‌యాన్ని హోస్ట్ తెలియ‌జేస్తారు. ప్ర‌దీప్ మాచిరాజు ఎన‌ర్జిటిక్ హోస్టింగ్ తో ఈ గేమ్ షో ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version