Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సరిపోదా శనివారం లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.తమిళ ప్రముఖ యాక్టర్ ఎస్‍జే సూర్య ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‍లో సూర్య పాల్గొన్నాడు.
ఇక క్యాస్టింగ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. వచ్చే శనివారం.. స్పెషల్ ట్రీట్ ఎదురుచూస్తోంది అంటూ రాసుకోస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు. ఇక ఆ ఫొటోలో ఒక రూమ్ లోని టేబుల్.. దానిపై ఒక బుక్.. చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వచ్చే శనివారం ఏం అప్డేట్ వస్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
