Site icon NTV Telugu

Sardar Trailer: నేషనల్ ట్రెండింగ్ అవ్వడం కోసం కార్తీ ఆ పని చేశాడా..?

Sardar

Sardar

Sardar Trailer: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఈ చిత్రంలో కార్తీ సరసన రజిషా విజయన్, రాశిఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు” అన్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఈ ట్రైలర్ లో కార్తీ డబుల్ రోల్ చేస్తున్నట్లు కనిపించాడు. స్పై సర్దార్.. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ గా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఇక విజయ్ కు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమంటే బాగా ఇష్టం. అందరూ తన గురించి మాట్లాడాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా యూనివర్సిటీలో ఉండే ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతోంది.. అందులో పాత మిలటరీ రహస్యాలు ఉంటాయి.. ఇక ఆ పత్రాలు కోసం సీబీఐ, రా అంతా వెతుకుతూ ఉంటారు. ఆ పత్రాలను వారికంటే ముందు విజయ్ కనుక్కొని నేషనల్ ట్రెండింగ్ అవ్వాలని చూస్తూ ఉంటాడు.

ఇక ఆ క్రమంలో విజయ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి..? అతనికి, సర్దార్ కు ఉన్న సంబంధం ఏంటి..? స్పై సర్దార్ జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. ఆ మిలటరీ పత్రాలను దొంగిలించింది ఎవరు..? అనేది కథగా తెలుస్తోంది. సర్దార్ గా ముసలి స్పై పాత్రలో, యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ వేరియేషన్స్ బాగా చూపించాడు. ఇక సర్దార్ కు జోడిగా రజిషా కనిపించగా.. విజయ్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. జీవీ ప్రకాష్ సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా దీపావళీ కానుకగా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కార్తీ మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version