Site icon NTV Telugu

Sara Khan: ఆమెతో నా భర్తకు ఎఫైర్ ఉంది.. 300 సార్లు చూశాను

sara khan

sara khan

రోజురోజుకు లాకప్ షోలో రహస్యాలు ప్రేక్షకులకు షాకులు ఇస్తున్నాయి. ఒక్కో కంటెస్టెంట్ జీవితంలో ఒక్కో రహస్యం .. అవి విన్న ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో రోజురోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇక ఇటీవల పూనమ్ పాండే, శివమ్ శర్మ లాంటి వారు తమ జీవితంలో ఉన్న అతి పెద్ద రహస్యాలను పంచుకోగా తాజాగా నటి, మోడల్ అయిన సారా ఖాన్ .. లాకప్ షో లో మాజీభర్తతో విడిపోవడానికి అసలు కారణం చెప్పి షాక్ ఇచ్చింది.

సారా ఖాన్, అలీ మర్చంట్‌ కొంతకాలం పాటు డేటింగ్‌ 2010 బిగ్ బాస్ స్టేజిపైనే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి మూడునాళ్ళ ముచ్చటలాగే మారింది. విభేదాలతో రెండు నెలల్లోనే ఎవరికి వారు యమునాతీరు అయిపోయారు. ఇక ప్రస్తుతం అలీ మర్చంట్‌ సీక్రెట్ ని లాకప్ షో లో ఈమె బయటపెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆలీకి  లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉంది.. అక్కడ ఒక అమ్మాయితో అతడికి ఎఫైర్ ఉంది. ఆ విషయం నాకు తెలిసి నేను నిలదీశాను. అయినా అతడు వినలేదు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 300 సార్లు చెప్పి చూశాను. అయినా అతడిలో మార్పు రాలేదు. నేను ప్రేమించినవాడు వేరొక అమ్మాయితో ఉన్నా కానీ అవకాశాలు ఇస్తూనే ఉన్నా.. ఎందుకంటె అతడు అంటే నాకు ఎంతో ఇష్టం.. కానీ ఆ ఇష్టానికి అతడు అర్హుడు కాదనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాను. విడాకులు తీసుకున్నాక అతడు హ్యాపీగా ఉన్నాడు. కానీ నేను మాత్రం ఆ బాధ నుంచి బయటపడడానికి నాలుగేళ్లు పట్టిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version