Sara Arjun: విక్రమ్ రీల్ కూతురు హీరోయిన్ ఎంట్రీ.. స్టార్ డైరెక్టర్ తో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Arjun: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎలాంటి కొదువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఏడాదిలో దాదాపు 5 మంచి కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. అందులో కనీసంలో కనీసం ఒక్కరైనా బాలనటిగా నటించేవారు ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది బాలనటిగా స్టార్ హీరోల సినిమాలో నటించిన చిన్నారులు.. చటుక్కున పెరిగి పెద్దయ్యి.. హీరోయిన్లుగా మారుతున్నారు. విశ్వాసం సినిమాలో అజిత్ కూతురు నటించిన అనికా సురేంద్రన్ బుట్టబొమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించిన ఎస్తేర్ సైతం అందాలను ఆరబోస్తూ.. కోలీవుడ్ లో మంచి ఆఫర్ పట్టేసింది. ఇక వీరితో పాటు విక్రమ్ కూతురు కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. చియాన్ విక్రమ్ నటించిన నాన్న సినిమా ఎంత మంచి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో విక్రమ్ కూతురుగా నటించిన చిన్నది సారా అర్జున్. ఆ సినిమాతో ఈ చిన్నారి ఎంతో మంచి గుర్తింపు అందుకుంది.
Sara Tendulkar: ఆయన నెంబర్‌వన్ అయ్యాడు.. ఈమె ఓపెన్ అయ్యింది!
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఇక ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 లో టీనేజ్ ఐశ్వర్య రాయ్ పాత్రలో నటించి మెప్పించింది. అప్పుడే సారా గురించి నెట్టింట చర్చ జరిగింది. ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు. ఇక ఇప్పుడు అదే నిజమవుతుందని సమాచారం. జెర్సీ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం గౌతమ్.. విజయ్ దేవరకొండ తో VD12 ను తెరకెక్కిస్తున్నాడు. అయితే దీనికన్నా ముందు విజయ్ ఫ్యామిలీ స్టార్ పై ఫోకస్ పెట్టడంతో.. గౌతమ్ ఈ లోపు మరో కొత్త కథను రాసుకున్నాడట. అందరు కొత్తవాళ్లతో ఆ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. ఈ చిన్న సినిమాలోనే హీరోయిన్ గా సారా అర్జున్ ను ఇంట్రడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే గౌతమ్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాడట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. సారా పంట పండినట్టే. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?