Site icon NTV Telugu

Sara Alikhan : సారా అలీ ఖాన్‌ వేసుకున్న ఈ డ్రెస్సు ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..

Saraa

Saraa

సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్‌ స్టయిల్‌ సెపరేటే.. అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్‌ ఇంచ్‌ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సినీ తారలు..

కానీ సారా మాత్రం అలా కాదు అంటుంది.. నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్‌ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్‌ డ్రెసెస్‌నే ఫ్రిఫర్‌ చేస్తాను అంటుంది.. మన ఫ్యాషన్‌ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్‌ బలానా. అందుకే అతని డిజైన్స్‌ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్‌ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్‌ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్‌ సెలబ్రిటీస్‌ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ ఈ బ్రాండ్ డ్రెస్సులు దొరుకుతాయి..

పైన ఫొటోలో సారా వేసుకున్న డ్రెస్సు ఇదే బ్రాండ్ కు సంబందించినది.. ఆ డ్రెస్సు ఖరీదు రూ. 1, 55, 000 ఉంటుంది.. అదే విధంగా ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్‌గఢ్‌ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్‌తో ప్రారంభమై.. నేడు జైపూర్‌లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్‌గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్‌ కీర్తి అంతర్జాతీయ స్థాయికీ చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది…ఇక సారాఖాన్‌ ధరించిన జేకేజే జ్యూలర్స్‌ ధర ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.. అంటే అది కూడా లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈ బ్రాండ్ వస్తువులు చాలా ప్రత్యేకమైన, ఖరీదైనవే..

Exit mobile version