NTV Telugu Site icon

Rakshit Shetty: ఖుషీ రిలీజ్ రోజే హైదరాబాద్ లో కూడా రష్మిక మాజీ ప్రియుడి సినిమా

Rakshit Shetty Sapta Sagaradaache Yello Vs Vijay Devarakonda Kushi

Rakshit Shetty Sapta Sagaradaache Yello Vs Vijay Devarakonda Kushi

Sapta Sagaradaache Ello – Side A Releasing in Hyderabad: రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ ఒకటవ తేదీనే రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను కన్నడ వెర్షన్ ను హైదరాబాద్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అంటే ఒక రకంగా పాన్ ఇండియా మూవీ. అయితే కన్నడలో విజయ్ దేవరకొండ సినిమాకి పోటీగా ఇప్పుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు

హేమంత్ రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి హైద‌రాబాద్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ప్రకటించగా అదులో మొద‌టి పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో గా.. రెండో పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో గా రానుంది. హేమంత్ రాజ్, రక్షిత్ శెట్టి కాంబోలో ఇంతకుముందు గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) సినిమా వ‌చ్చి క‌న్న‌డలో బ్ల‌క్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సుమారు 8 ఏండ్ల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సప్త సాగరే దాచే ఎల్లోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రక్షిత్ శెట్టి సొంత ప్రొడక్షన్ అయిన పరమవా స్టూడియోస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Show comments