Santosh Sobhan intresting comments on Marriage: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ మహర్షి డైరెక్షన్లో ‘ప్రేమ్‌కుమార్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సంతోష్ శోభన్. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ కుర్రాడి పరిస్థితి ఏంటి? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కించినట్టు చెబుతున్నారు. ఇక చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఆయన మీడియాతో ముచ్చటించారు.
Jailer: ఇదేంటి బాసూ రజనీ గాలి ఇట్టా తీసేశారు.. చూసుకోబళ్ళా?
అయితే ఈ క్రమంలో సంతోష్ శోభన్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లిళ్ల గురించే సినిమాలు చేస్తున్నారు మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే “పెళ్లి చేసుకుంటాను, కానీ ఈ పంచెలతో విసిగిపోయా అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో తాను చేసిన అన్ని సినిమాలు పెళ్లి నేపథ్యంలోనే ఉన్నాయని ఇక కొన్నాళ్లు పెళ్లి పై సినిమాలు చేయనని వెల్లడించాడు. 1990 నుంచి 2000 వరకు మనం చాలా సినిమాల్లో పెండ్లి జరుగుతుండగా.. ఆగండి.. అంటూ హీరో రావడం, హీరోయిన్ ఫాదర్‌ను కన్విన్స్ చేసి పెళ్లిపీటలపై వున్న హారోయిన్‌ను పెండ్లి చేసుకోవడం చూస్తున్నాం, కానీ అప్పటికే పీటలపై వున్న పెండ్లికొడుకు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అలాంటి వాడిపై కథ చెప్పగానే చాలా బాగా నచ్చి ఈ సినిమా చేశామని సంతోష్ శోభన్ అన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో పంచె కట్టుకుని పరుగెత్తాల్సి వచ్చిందని అందుకే ట్రెడిషనల్ పెళ్లి అంటేనే భయం వేస్తోందని అన్నారు.