Site icon NTV Telugu

Santhosh Shoban: తెలుగులో హీరోలు లేరా.. దుల్కర్ పై యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు

Santhosh

Santhosh

Santhosh Shoban: ఏక్ మినీ కథ చిత్రంతో హీరోగా హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఈ హీరో ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అన్ని మంచి శకునములే అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ ఆవుతోంది. ఇక ఈ బ్యానర్ లోనే రిలీజ్ కు సిద్దమైన సినిమా సీతారారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘సీతారామం స్వరాలు’ పేరుతో ఒక మ్యూజిక్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్.. ఈ ఈవెంట్ కు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో పనిచేసిన హీరోలు, టెక్నీషియన్స్ అందరూ హాజరయ్యారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. అయితే ఈ వేదికపై సంతోష్ శోభన్ తన మనసులో ఉన్న ఆపని వెళ్లగక్కాడు.

తెలుగులో హీరోలు లేరా..? మలయాళం నుంచి హీరోలను తీసుకు రావాలా..? మేము ఉన్నాం కదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే దుల్కర్ ను తెలుగు హీరో అని ఒప్పుకొంటాను అంటూ కొన్ని ప్రశ్నలను దుల్కర్ ను అడిగాడు. ఇక దుల్కర్ ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో సంతోష్ మౌనంగా వెనుతిరిగాడు. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా..? ఆ ఈవెంట్ లో ఇదొక ప్రమోషన్ స్టంట్. ప్రేక్షకులను నవ్వించడానికి సంతోష్, మాళవిక ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. ఇక మధ్యలో సుమ వీరు మాట్లాడింది సీక్రెట్ గా వీడియో తీసి చూపించి నవ్వులు పూయించింది. ఇదంతా ఇక్కడ సరదాగా చేసినా.. పలువురు మాత్రం సంతోష్ చెప్పిన దాంట్లో తప్పు ఏమి ఉంది..? తెలుగులో హీరోలు, హీరోయిన్లు లేరా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version