NTV Telugu Site icon

Santhosh Soban: కళ్యాణం కమనీయం ఆహాలో…

Santhosh Soban

Santhosh Soban

సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని అనీల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు లాంటి సినిమాలు థియేటర్స్ లో ఉన్న సమయంలో, వాటితో పాటు రిలీజ్ అవ్వడమే కళ్యాణం కమనీయం సినిమాకి మైనస్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు కానీ కళ్యాణం కమనీయం సినిమాకి వెళ్లలేదు. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి థియేటర్స్ కూడా పెద్దగా దొరకలేదు. ఈ కారణంగా కళ్యాణం కమనీయం సినిమా ఆశించిన రిజల్ట్ ని అందుకోలేదు. హిట్ అయితే అవ్వలేదు కానీ మరీ నెగటివ్ ని టాక్ ని మాత్రం సొంతం చేసుకోలేదు. అసలు ఎక్కువ థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంటే కదా కళ్యాణం కమనీయం సినిమా బాగుందో లేదో తెలియడానికి… ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ‘ఆహా’లో నిన్నటి నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి. శివరాత్రి స్పెషల్ గా ఆహా నుంచి కళ్యాణం కమనీయం సినిమా ఒటీటీలోకి వచ్చేసింది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంతర్టైనర్ ని కుంటుంబంతో సహా చూసి చూసి శివరాత్రి జాగారాన్ని గడిపేయండి.