NTV Telugu Site icon

Santhosh Shoban: శ్రీదేవితో శోభన్ బాబు హిట్ కొడతాడా?

Santhosh Shoban

Santhosh Shoban

యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన లక్ ట్రై చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. 2023 సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ బాలయ్య-చిరుల బాక్సాఫీస్ ర్యాంపేజ్ ముందు సంతోష్ శోభన్ కనిపించలేదు. నెల తిరగకుండానే మరో సినిమాతో హిట్ ని టార్గెట్ చేస్తున్నాడు సంతోష్ శోభన్. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కమ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ “ఝుం ఝుమందిలే”ని ఫిబ్రవరి 6న ఉదయం 11:11కి రిలీజ్ చెయ్యనున్నారు.

ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ని చేస్తే శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి లేదంటే సంతోష్ శోభన్ లిస్టులో మరో ఫ్లాప్ చేరుతుంది. పైగా ఫిబ్రవరి 17న శాకుంతలం, ధమ్కీ, వినరో భాగ్యము విష్ణుకథ, ఆంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శాకుంతలం సినిమాకి వాయిదా పడకుండ రిలీజ్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ థియేటర్స్ అన్ని ఈ సినిమాకే వెళ్తాయి. నైజాంలో ధమ్కీ సినిమాకి ఎక్కువ థియేటర్స్ వెళ్తాయి. అయితే ధమ్కీ సినిమా ప్రమోషన్స్ జరగట్లేదు కాబట్టి దాదాపు వాయిదా పడినట్లేనని అనుకుంటున్నారు. ఈ గ్యాప్ ని కాష్ చేసుకుంటే సంతోష్ శోభన్ కి మంచి హిట్ పడే ఛాన్స్ ఉంది.