ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలైనా సంగతి తెలిసిందే. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నా’ మూవీ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఊహించని స్పందన అందుకోని భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తుంది. అంతే కాదు నెవర్ బిఫోర్ బుకింగ్స్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ లీడ్ లో ఉన్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ప్రతి రోజు బుక్ మై షో లో లక్షల్లో టికెట్స్ బుకింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లీడ్ లో ఉన్నట్లు బుక్ మై షో వారు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.
అయితే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రన్ ఇపుడు ట్రేడ్ వర్గాలని షాక్‌కి గురి చేస్తుంది. ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొట్టిన మూవీ ‘RRR’. ఈ సినిమాని బ్రేక్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ డే 5 కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ, తెలుగు స్టేట్స్ లో ఏకంగా నాన్ ‘RRR’ రికార్డు సెట్ చేయడం విశేషం. అవును ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఐదో రోజు రూ.13 కోట్లకి పైగా షేర్ వస్తే, దాని తర్వాత ఆల్ టైం టాప్ 2 స్థానంలో రూ.12 కోట్లకి పైగా షేర్ తో వెంకీ మామ మూవీ నిలిచినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి రన్ టైం ముగిసే లోపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.