ఈ ఏడాది సంక్రాంతి సినిమాల జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, ఈగల్‌తో రవితేజ, పోటీపడుతుండగా… ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే… థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనవరి 14న రిలీజ్ రానున్న నాగార్జున నా సామిరంగ… ఈగల్ ప్లేస్‌లో ఓ రోజు ముందుకొచ్చి జనవరి 13న థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అఫిషీయల్ కన్ఫర్మేషన్ ఒక్కటే పెండింగ్ అంటున్నారు. దీంతో ఈగల్ సినిమాను రెండు వారాలు వెనక్కి వెళ్లి సందర్భంగా రిపబ్లిక్ డే రోజు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
ప్రస్తుతానికైతే… సంక్రాంతికి ఈగల్ వస్తుందా? లేదా? అనేది ఇంకా డైలమాలోనే ఉంది కానీ మరోవైపు ఈగల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగల్’ సెన్సార్ టాక్ కూడా బాగుందని తెలుస్తోంది. రొటీన్ కమర్షియల్ మాస్ మూవీ అయినా కూడా… రవితేజ కెరీర్‌లో ఈగల్ ఎంతో స్పెషల్‌గా నిలవనుందని చెప్పారట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఊర మాస్ లుక్‌లో గడ్డంతో మస్త్ ఉన్నాడు రవితేజ. ఈ సినిమాలో మాస్ రాజా సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈగల్ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అన్నౌన్స్మెంట్ రావాల్సిందే.