బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హిందీ ఛత్రపతి సినిమా మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇదే రోజున ఛత్రపతికి పోటీగా IB 71 అనే సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీరో విధ్యుత్ జమ్వాల్ నటిస్తూ నిర్మించిన ఈ మూవీపై ‘ఏ’ సెంటర్స్ లో మంచి అంచనాలు ఉండడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ తెస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన పీరియాడిక్ డ్రామా కావడంతో IB 71పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాలని తలకిందులు చేస్తూ IB 71 సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలు సౌండ్ చెయ్యట్లేదు. మొదటి రోజు కనీసం కోటి రూపాయల షేర్ కూడా IB 71 కలెక్ట్ చెయ్యలేకపోయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మన టాలీవుడ్ డైరెక్టర్ కావడం విశేషం. మొదటి సినిమానే దగ్గుబాటి రానాతో (ఘాజీ)ని చేసిన సంకల్ప్ రెడ్డి ఆడియన్స్ కి కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు.
ఇండియాలోనే మొదటిసారి రూపొందిన మొదటి సబ్ మెరైన్ సినిమా కావడంతో సంకల్ప్ రెడ్డి క్రియేట్ చేసిన కొత్త ప్రపంచాన్ని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు. కలెక్షన్స్ తో పాటు బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఫస్ట్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంకల్ప్, ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతాడని అంతా అనుకున్నారు కానీ సంకల్ప్ మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఘాజీ తర్వాత వరుణ్ తేజ్ తో ‘అంతరిక్షం’ సినిమా చేసిన సంకల్ప్, ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేశాడు. దీంతో తెలుగులో అవకాశాలు రాలేదు, నార్త్ కి వెళ్లిపోయిన సంకల్ప్ అక్కడ విధ్యుత్ జమ్వాల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ లో అయినా హిట్ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు IB 71తో బాలీవుడ్ లో కాస్ట్లీ ఫ్లాప్ ఇచ్చాడు. సంకల్ప్ రెడ్డి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త పడకుంటే వన్ సినిమా వండర్ గా మిలిపోవాల్సిందే.