Site icon NTV Telugu

Sanjay Leela Bhansali: అందం అంతా ఒకటే చోట ఉంది…

Heera Mandi

Heera Mandi

Sanjay Leela Bhansali: ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే డెఫినెట్ గా టాప్ 3లో ఉండే దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ’. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో, వార్ సినిమాల్లో కూడా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చెయ్యడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. భారి సెట్స్ లేకుండా, హెవీ లైట్స్ వాడకుండా, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని పెట్టడంలో సంజయ్ లీలా భన్సాలీకి స్పెషల్ మార్క్ ఉంది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే సంజయ్ లీలా భన్సాలీ ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హీరామండి’. నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ భారి ప్రాజెక్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ భారి ప్రాజెక్ట్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ మరియు అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించారు. భన్సాలీ ట్రేడ్ మార్క్ ‘గోల్డెన్ కలర్ ప్యాలెట్‌’తో ఈ మోషన్ పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే బ్యూటీ మొత్తం ఒకటే పోస్టర్ లో ఉన్నట్లు ఉంది. మరి ఈ అంబీషియస్ ప్రాజెక్ట్ గురించి ఇతర డీటైల్స్ తెలియాల్సి ఉంది.

Read Also: Pathaan: 1000 కోట్లు… అది షారుఖ్ ఖాన్ కంబ్యాక్ రేంజ్…

Read Also: Project K: 2024 సంక్రాంతికి అన్ని రికార్డులు తిరగరాయబడును…

Exit mobile version