బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. “కేజీఎఫ్-2″లో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెప్పించారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిన సంజూ భాయ్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో ఆయన డ్రగ్స్ కు బానిసవ్వడం కూడా ఒకటి. అయితే తాజాగా “కేజీఎఫ్-2” హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సంజూ భాయ్ తనకు అసలు డ్రగ్స్ అలవాటు ఎలా అయ్యింది ? అనే విషయాన్ని వెల్లడించారు. సంజయ్ మాట్లాడుతూ “అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే తెగ సిగ్గు పడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్ గా కన్పిస్తానని, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను” అని వెల్లడించారు.
Read Also : Ante Sundaraniki : మరో రెండు భాషల్లో కూడా… సర్ప్రైజ్ లోడింగ్
అంతేకాకుండా సంజూ భాయ్ డ్రగ్స్ కు బానిసయ్యాక ఎదుర్కొన్న పరిస్థితులను కూడా వెల్లడించారు. డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్ లో కొన్ని రోజులు గడిపారు ఆయన. రిహబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అందరూ తనను డ్రగ్గీ అని పిలిచేవారని, ఆ మచ్చని పొగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అందుకే చాలా కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నారట సంజూ. దీంతో అప్పటి నుంచి ‘క్యా బాడీ హై’ అని అనడం స్టార్ట్ చేశారని చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘కేజీఎఫ్-2’తో సంజూ భాయ్ ఈజ్ బ్యాక్ అనిపించాడు బాబా !