Sanjay Dutt : సంజయ్ దత్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్, తమిళ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రూ.72 కోట్ల ఆస్తి విషయాన్ని బయట పెట్టారు. 2018లో నిషా పాటిల్ అనే మహిళా అభిమాని తన పేరిట ఉన్న ఎస్టేట్ మొత్తాన్ని నా పేరు మీద రాసి చనిపోయింది. ఆమె అనారోగ్యంతో ఉండటంతో తన చివరి రోజుల్లో తన సంపద రూ.72 కోట్ల ఆస్తి నాకు చెందాలని బ్యాంకుకు సూచించింది. కానీ నేను ఆ ఆస్తిమొత్తం ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేశా. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆమె నా మీద పెంచుకున్న అభిమానమే నాకు వేల కోట్ల ఆస్తితో సమానం అంటూ చెప్పుకొచ్చారు సంజయ్.
Read Also : Rakul Preet : పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ఘాటు కామెంట్లు
ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంజయ్ దత్ కు నార్త్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉండేది. కానీ కేసుల్లో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయింది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు సంజయ్ దత్. తెలుగులో అఖండ-2లో విలన్ గా నటిస్తున్నారు. అలాగే మరో స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ ఈ నడుమ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.
Read Also : Roshniwaliaa : మా అమ్మ శృంగారానికి ఫ్రీడమ్ ఇచ్చింది.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
