టాలీవుడ్‌లో వినూత్నమైన కంటెంట్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ కోవలోనే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ‘సందిగ్ధం’. ‘తీర్థ క్రియేషన్స్’ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రలు పోషించగా.. ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్ రోల్‌లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా శనివారం నాడు ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర దర్శకుడు పార్థసారధి కొమ్మోజు మాట్లాడుతూ.. “మా ‘సందిగ్ధం’ సినిమా ప్రయాణంలో నా భార్య, నిర్మాత అయిన సంధ్య గారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అలాగే ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. అందరి సహకారం వల్లే అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మే 29న థియేటర్లలోకి వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. ఈ చిత్రానికి నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా, విశ్వన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సందిగ్ధం’ మే 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
