సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన సందీప్, సినిమా లెక్కల్ని మార్చడానికి రెడీ అయ్యాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయిస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. బుకింగ్స్ అన్నీ ఫైర్ మోడ్ లో ఉండడంతో అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో తన మార్క్ ని చూపిస్తున్నాడు. అనిమల్ సినిమా సాలిడ్ హిట్ అయితే సందీప్ పేరు ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చేలా వినిపించడం గ్యారెంటీ. ప్రమోషన్స్ బిజీగా ఉన్న సందీప్… మహేష్ బాబుతో సినిమా చేస్తాను అంటూ తేల్చి చెప్పేసాడు.
అర్జున్ రెడ్డి తర్వాతే సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుకి ఒక కథ చెప్పాడు. ఆ టైమ్ లో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అనిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మహేష్ ని పిలిచిన సందీప్ రెడ్డి వంగ, ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో… “మహేష్ అగ్రెసివ్ క్యారెక్టర్ అంటే మామూలుగా వుండదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ చేసింది మంచి అగ్రెసివ్ క్యారెక్టర్. ఎప్పటికైనా మహేష్ తో ఫ్యూచర్ లో కచ్చితంగా సినిమా చేస్తాను” అంటూ తేల్చి చెప్పేసాడు. సందీప్ రెడ్డి వంగ స్టైల్ లో బిజినెస్ మ్యాన్ రేంజ్ సినిమా, సూర్య భాయ్ లాంటి క్యారెక్టర్ పడితే పాన్ ఇండియా బాక్సాఫీస్ కి పూనకాలు రావడం గ్యారెంటీ. అయితే సందీప్ నెక్స్ట్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. 2025 రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా ఉంది. సందీప్ స్పిరిట్, అల్లు అర్జున్ సినిమాలు కంప్లీట్ చేసేలోపు మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ చేస్తే… అప్పుడు మహేష్-సందీప్ కాంబినేషన్ సెట్ అవుతుంది.