NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: యానిమల్ రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. సందీప్ ఏమన్నాడంటే.. ?

Ram

Ram

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా యానిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. యానిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రతి జనరేషన్ కు ఒక డైరెక్టర్.. తన విజన్ తో కొత్త మార్పు తీసుకొస్తాడు. సందీప్.. ఇప్పుడు అదే చేశాడు. అసలు ఒక సినిమా ఎంత వైలెంట్ గా ఉండాలో అంత వైలెన్స్ ను ఇందులో చూపించాడు. కొంతమందికి ఈ సినిమా ఎక్కకపోయినా.. చాలామంది సినిమా సూపర్ అని చెప్పుకొస్తున్నారు. ఇక అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన రీతిలో యానిమల్ రివ్యూ ఇస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. యానిమల్ సినిమాపై నాలుగు పేజీల రివ్యూ ఇచ్చి షాక్ ఇచ్చాడు. మొదటి సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు తనకు నచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. సందీప్ రెడ్డి టేకింగ్ ను, రణబీర్ కపూర్ నటనను పొగిడేశాడు. అంతే కాకుండా చివరిలో రణబీర్, సందీప్ షూస్ నాకాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

Chiranjeevi: చిరు సరసన సీత.. శ్రీదేవిని మించి ఉండబోతుందంట.. ?

ఇక ఆర్జీవీ ఇచ్చిన యానిమల్ రివ్యూకు సందీప్ రెడ్డి ముగ్దుడయ్యాడు. యానిమల్ రివ్యూ తనదైన శైలిలో ఇచ్చినందుకు వర్మకు.. సందీప్ థాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా తనకు ఎంతో ఫేవరేట్ డైరెక్టర్ అయిన వర్మ.. తన సినిమా చూసి రివ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ” మిస్టర్ రామ్ గోపాల్ వర్మ చేసినంత సేవ మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి అందించలేదని నేను నమ్ముతున్నాను…. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ నుండి యానిమల్ రివ్యూ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని స్వంత శైలిలో వ్రాసిన రెండు విషయాలను మినహాయించి, అన్నింటికీ నిజంగా కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments