Sandeep Reddy Vanga Plans Most Violent First Night in Animal: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మేకర్స్ ఆ తరువాత ఈ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది. ణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
Unstoppable Limited Edition: బాలయ్య దిగుతున్నాడు.. గెట్ రెడీ రా అబ్బాయిలూ!
సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ల ఫస్ట్ నైట్ ను అత్యంత హింసాత్మకంగా ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో పెళ్లి చేసుకున్న తర్వాత, రణబీర్ కపూర్, రష్మిక సంప్రదాయ తెల్లని ధోతీ & తెల్లటి చీరలో తమ మొదటి రాత్రికి సిద్ధమవుతారని, సరిగ్గా గూండాల గుంపు అదే సమయంలో రణబీర్ నివాసంపై దాడి చేస్తుందని అంటున్నారు. రణబీర్ ఒకవైపు గూండాలను ఒక రేంజ్ లో ఆదుకుంటూనే, మరోవైపు రష్మికతో రొమాన్స్ చేస్తూ ఉంటాడని అంటున్నారు. అంటే ఒక పక్క హింస & మరోపక్క శృంగారాన్ని మిళితం చేసి ఆ సీన్ అంతా ఒక రేంజ్ లో తెరకెక్కించాడని అంటున్నారు. ఈ ఎపిసోడ్ షో-స్టాపర్‌గా ఉంటుందని, సినిమా మొత్తానికి హైలైట్ ఆ ఉంటుందని భావిస్తున్నారు.