Sundeep Kishan: సెలబ్రిటీలు అంటే.. ఏదో అనుభవించేస్తున్నారు.. బోల్డంత ఆస్తి ఉంటుంది.. వాళ్ళకేంటి అనుకుంటారు కానీ, వాళ్ళకుండే అప్పులు వాళ్లకు ఉంటాయి. వాళ్ళకుండే సమస్యలు వాళ్లకు ఉన్తయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అప్పుడు.. అరెరే అవునా.. ఏ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా.. ? అని అనుకుంటారు. తాజాగా కుర్ర హీరో సందీప్ కిషన్ గురించి కూడా అభిమానులు అలానే అనుకుంటున్నారు. మొదటిసారి సందీప్.. తాను ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక కుర్ర హీరో.. తన సినిమాలతో పాటు వేరే హీరో సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు అంటే.. మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ హీరోతో ఉన్న స్నేహం.. రెండు కథ బాగా నచ్చడం.. మూడోది డబ్బు లేక. ఇక సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సందీప్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన సందీప్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ” నేను సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే. గత కొంతకాలంగా నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్ లో కూడా పెట్టుబడి పెట్టాను. వారందరికీ జీతాలు ఇవ్వాలి. వారికీ జీతాలు ఇవ్వడానికే నేను సినిమాలు చేస్తున్నాను.. గెస్ట్ రోల్స్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సందీప్ హిట్ అందుకొని ఆర్థిక ఇబ్బందులను దాటుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.
