ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువే. ఇతర ఇండస్ట్రీస్ నుంచి కొత్త కొత్త బ్యూటీలను ఇంపోర్ట్ చేసుకుంటున్నా.. లాంగ్ కెరీర్ స్పాన్ తో నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అనుష్క, కాజల్ అగర్వాల్, త్రిష, శ్రేయ లాంటి హీరోయిన్ల స్థాయిలో లాంగ్ స్పాన్ ప్రస్తుత యంగ్ హీరోయిన్స్ కి ఉండట్లేదు. రష్మిక, పూజా హెగ్డే లాంటి వారు ఉన్నా వీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఎక్కువ డేట్స్ కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. కృతి శెట్టి, శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీస్ కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఏకంగా ఎనిమిది, తొమ్మది సినిమాలున్నాయి. అది కూడా మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇక ఈ మధ్య తర్వాత బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవలేదు. భీమ్లా నాయక్‌లో రానా సరసన షార్ట్ లెంగ్త్ క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత బింబిసారలోనూ కళ్యాణ్ రామ్‌తో చాలా తక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ధనుష్ ‘సార్’ సినిమాతో అమ్మడికి మంచి పేరొచ్చింది.
ఇక ఇప్పుడు విరూపాక్షతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. అంతేకాదు ఈ సినిమాతో అమ్మడు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఇటివలే కాలంలో ఈవెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు కూడా ఈ మలయాళ బ్యూటీ హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది. నిన్న, మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన సంయుక్త.. విరూపాక్ష తర్వాత మరింత డోస్ పెంచేసింది. గ్లామర్ షోనే కాదు సంయుక్త మీనన్ రెమ్యూనరేషన్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 50 లక్షల మార్క్‌ని చేరుకున్న సంయుక్త.. ఇక పై కోటికి పారితోషికం పెంచేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎలాగూ సంయుక్తకు హిట్లు పడుతున్నాయ్ కాబట్టి మేకర్స్ కూడా అడిగినంత ఇస్తారనడంలో సందేహమే లేదు. మొత్తానికి నాలుగు సినిమాలకే కోటి రూపాయలు వరకూ తీసుకుంటూ సంయుక్త కూడా టాలీవుడ్‌లో టాప్ లిస్ట్‌లోకి చేరిపోయినట్టే.
