Site icon NTV Telugu

Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్‌ బాబు

Sampoornesh

Sampoornesh

Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని హీరో సంపూర్ణేష్‌ బాబు అన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సోదరా. ఇందులో మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నారు. మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్ మాట్లాడుతూ.. ‘ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ. ప్రతి ఒక్కరినీ అద్భుతంగా నవ్విస్తుంది. అదే టైమ్ లో ఏడిపిస్తుంది. ఇది చూస్తే మీ లైఫ్‌ లో జరిగిన రియల్ సంఘటనలు గుర్తుకు వస్తాయి’ అంటూ తెలిపారు.

‘కుటుంబ పరమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. ఎంటర్ టైన్ మెంట్ ఎంత ఉంటుందో.. ఎమోషన్ కూడా అంతే ఉంటుంది. ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది ఈ సినిమా. మరోసారి మంచి కామెడీ కథ దొరికితే కచ్చితంగా చేస్తాను. ఏ సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు సంపూర్ణేష్‌ బాబు.

Read Also : SSMB29 : మహేశ్ తో అతిపెద్ద బోట్ ఫైట్ సీన్.. రాజమౌళి భారీ ప్లాన్..?

మరో హీరో సంజోష్‌ మాట్లాడుతూ..’సంపూతో కలిసి బ్రదర్ లాగా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. అన్నదమ్ముల వచ్చే మనస్పర్థలను ఎత్తి చూపిస్తుంది ఈ మూవీ. కచ్చితంగా ప్రతి ఒక్కరినీ టచ్ చేస్తుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అన్నదమ్ముల బంధాలు మరింత బలపడుతాయనే నమ్మకం ఉంది. ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్టు ఎమోషన్ తో పాటు కామెడీని కూడా మిలితం చేసి చూపిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version