NTV Telugu Site icon

Sammohanuda: ఏయ్.. ఏయ్.. కిరణ్ అన్నా.. రాధికతో రొమాన్స్.. ఈ రేంజ్ లోనా

Sammohanuda Song Released

Sammohanuda Song Released

Sammohanuda from Rules Ranjann Released: కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించిన కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, ‘నాలో నేనే లేను’ పాటకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించగా తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘సమ్మోహనుడా’ అంటూ సాగుతున్న లిరికల్ వీడియోని చిత్ర బృందం గురువారం ఉదయం విడుదల చేసింది. నాయకానాయికలపై చిత్రీకరించిన శృంగార గీతమిది.

Klin Kaara: క్లీంకార పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి : ఉపాస‌న‌

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని సాంగ్ చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు.. హీరో హీరోయిన్లకు ఒకరిపై ఒకరికున్న మోహాన్ని తెలియజేస్తూ నిప్పు, నీరు నేపథ్యంలో పాటను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటోంది. అమ్రీష్ గణేష్ స్వరపరిచిన సంగీతం ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లి అద్భుతం అనిపించేలా ఉంది. ఇక ఈ పాటకి గీత రచయిత రాంబాబు గోసాలతో కలిసి దర్శకుడు రత్నం కృష్ణ సాహిత్యం అందించడం గమనార్హం. “సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా, ఇష్టసఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా” అంటూ హీరోయిన్ తన ప్రియుడైన హీరోకి తన దేహాన్ని అర్పిస్తానని పాడుతున్నట్టు ఉండడంతో అందరిలో ఆసక్తి రేగుతోంది. “సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా, మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా” వంటి లైన్స్ తో అందంగా సాగింది. ఇక ఈ పాటని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఆలపించగా ఆమె తన గాత్రంతో పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చారు.