Site icon NTV Telugu

Sammathame : రిలీజ్ డేట్ ఫిక్స్… కిరణ్ అబ్బవరం సోలో ప్లాన్

Sammathame

Sammathame

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ “సమ్మతమే”. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “సమ్మతమే” మూవీ జూన్ 24న థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఆ పోస్టర్ లో చాందిని బట్టలు ఆరేస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా వాటేసుకోవడం కన్పిస్తోంది.

Read Also : RGV : అజయ్‌ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్

ఇక ఇలా సోలో రిలీజ్ ను ఎంచుకోవడంతో కిరణ్ అబ్బవరం సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఈ సమ్మర్‌లో మా దగ్గర చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా చిన్న, మధ్యతరహా బడ్జెట్ సినిమాలు పెద్ద సినిమాల మధ్య నలిగిపోకుండా ఉండడానికి తమ సినిమాల విడుదల కోసం వేరే తేదీలను ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే జూన్ 24న “సమ్మతమే” తప్ప మరో సినిమా లేదు. కానీ ఈ సినిమా సోలోగా రిలీజ్ అవుతుందా? లేక పోటీగా మరే ఇతర సినిమాలైనా వచ్చే అవకాశం ఉందా? అన్నది చూడాలి.

Exit mobile version