NTV Telugu Site icon

Sameera Reddy: అవి పెంచే సర్జరీ కోసం బలవంతం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సమీరా రెడ్డి

Sameera Reddy Breast Enlargement News

Sameera Reddy Breast Enlargement News

Sameera Reddy Told To Get Breast Surgery But She Denied: బాలీవుడ్ తారల రూపురేఖలు మారడం చూసి అభిమానులు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. ఒకప్పుడు చాలా నార్మల్‌గా కనిపించే తమ అభిమాన తార ముక్కు నుంచి, బాడీ షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి ఇలా తయారు అయింది అనే కామెంట్స్ చాలాసార్లు ఆయా నటులను ఇబ్బంది పెడతాయి. దీంతో కొందరు సర్జరీలు కూడా చేయిస్తూ ఉంటారు. ఫిల్లర్ల నుండి సీట్ సర్జరీ దాకా, నోస్ జాబ్(ముక్కు సర్జరీ) లిప్ జాబ్ – (పెదవి సర్జరీ) వరకు ఇది చాలా సాధారణమైంది. అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ లాంటి వాటిని ఆశ్రయించామని చాలా మంది తారలు స్వయంగా ఒప్పుకున్నారు కూడా. అయితే ఎవరెన్ని సలహాలు ఇచ్చినా తమ సహజమైన శరీరాన్ని కత్తి గాట్లకు గురి చేయని వారు కొందరు ఉన్నారు, వారిలో సమీరా రెడ్డి ఒకరు. ఇటీవల నటి మాట్లాడుతూ, పరిశ్రమలో తాను తన కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు, బ్రెస్ట్ ను ఎన్లార్జ్(రొమ్ము సైజ్ పెంచే) సర్జరీ చేయసుకోమని ఒత్తిడి తెచ్చారని చెప్పింది.

Ramcharan : బ్రేకింగ్: బాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్

హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సమీరా రెడ్డి తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స చేయమని తనపై చాలా ఒత్తిడి తెచ్చారని చెప్పింది. నటి మాట్లాడుతూ, ‘‘కెరీర్‌లో టాప్‌లో ఉన్నప్పుడు బ్రెస్ట్‌ సర్జరీ చేయించుకోవాలని నాపై ఎంత ప్రెజర్‌ పడ్డానో కూడా చెప్పలేను.. చాలా మంది నాతో సమీర్, అందరూ చేస్తున్నారు, నువ్వేం స్పెషల్ కాదన్నారు. కానీ నేను ఇలాంటివి కోరుకోలేదు.” అని పేర్కొంది. అయితే ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయాలనుకునే ఎవరినీ నేను జడ్జ్ చేయను కానీ నేను అలా చేయాలనుకోను అని ఆమె పేర్కొంది. ‘నా చర్మం చెడుగా ఉన్నప్పుడు, నేను దానిని చూపిస్తాను, నా సెల్యులైట్, నా బరువును చూపిస్తాను. నేను ఖచ్చితమైన 36-24-36 ఫిగర్ కంటే ఇలా కనిపించడానికి ఇష్టపడతాను అని ఆమె కామెంట్ చేసింది.

Show comments