Site icon NTV Telugu

మదర్ ఫిట్నెస్ పై సమీరా రెడ్డి ఇంప్రెసివ్ వీడియో

నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలే చేసింది. ఆ సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే కావటం విశేషం.. టాలీవుడ్ లో స్టార్ హోదా లభించే టైమ్ లోనే సమీరా బాలీవుడ్ బాట పట్టింది. ఆపై పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు వున్నా ఆమె బరువు పెరిగిందనే విమర్శలు ఆమధ్య రావడంతో స్లిమ్ గా మరి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందేమోనన్న సంకేతాలు కూడా మొదలైయ్యారు.

ఇదిలావుంటే, సమీరా రెడ్డి ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇంప్రెసివ్ గా ఉందంటూ అభిమానులు అభినందిస్తున్నారు. స్కిప్పింగ్, పుషప్స్, షటిల్, బాక్సింగ్, డంబుల్, రన్నింగ్ వంటి వర్కౌట్లతో సమీరా తన సౌందర్యాన్ని మరింత శక్తివంతంగా మారుస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్​ను ఆస్వాదిస్తున్న ఆమె.. కరోనా సమయంలో కుటుంబంలో అందరికి పాజిటివ్ కేసులు రావడంతో చాలా ఆవేదన వ్యక్తం చేసింది.. సెకండ్ బేబీ పుట్టిన సమయంలోనే సమీరా కరోనా బారినపడగా, మనోధైర్యంతో పోరాడి ఆదర్శంగా నిలిచింది. ఇక నాలుగు పదుల వయసు దాటినా సమీరా యంగ్ ఫిట్నెస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera)

Exit mobile version