Site icon NTV Telugu

Adi Saikumar: ‘తీస్ మార్ ఖాన్’ నుండి ‘సమయానికే’ సాంగ్!

Adi

Adi

‘Samayanike’ song from ‘Tees Maar Khan’!

ఆది సాయికుమార్ హీరోగా డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. ‘నాటకం’ వంటి భిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్‌ జి గోగణ ఈ సినిమాను రూపొందించారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట ‘సమయానికే’ను విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్ ను ఆది, పాయల్ పై చిత్రీకరించారు. ఈ పాటలో పాయల్ అందాలు హైలెట్ గా నిలిచాయి. అలానే ఆది షర్ట్ లేకుండా కనిపించారు. ఈ న్యూ లుక్ కోసం ఆది బాగానే వర్కౌట్స్ చేసినట్టు తెలుస్తోంది. సాయి కార్తీక్ అందించిన స్వరాలకు తగ్గట్టుగా రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. దీనిని శ్రుతి ఆలపించారు.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రను పోషించిన ‘తీస్ మార్ ఖాన్’ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు ఆగస్ట్ 19న తీసుకురాబోతున్నారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్ అని తెలుస్తోంది.

 

Exit mobile version