Samantha : సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోద్ది. సినిమాలు పెద్దగా చేయట్లేదు గానీ.. ఈ మధ్య బాగా టూర్లు వేస్తోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుగా క్లోజ్ గా కనిపిస్తోంది. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది చెప్పట్లేదు. కానీ వరుస ఇంటర్వ్యూల్లో రిలేషన్ షిప్, పర్సనల్ లైఫ్, హెల్త్ గురించి ఎన్నో కామెంట్లు చేస్తోంది. వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తోంది ఈ బ్యూటీ. ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరూ లేకపోయినా మనం ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం అంటూ తెలిపింది.
Read Also : Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..
ఈ సమాజంలో ఆడపిల్లలకు ఎప్పుడూ అడ్డంకులే ఉంటాయి. అది చేయకు.. ఇది చేయు అంటుంటారు. రిలేషన్ లో ఇలాంటివి కామన్ గానే వినిపిస్తాయి. మనం ఎంచుకున్న పని కరెక్ట్ అయినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనల్ని నమ్మిన వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. తాత్కాళిక డ్రామాలు ఎప్పటికీ శాశ్వతం కావు. మనం హెల్త పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే కచ్చితంగా దెబ్బ పడుతుంది. నా బాడీ ఏది చెబితే నేను అదే పాటిస్తాను. ఎంత ఫిట్ గా ఉంటే అంత బెటర్. హెల్త్ కు ఉన్న వాల్యూ ఎలాంటిదో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అంటూ చెప్పుకొచ్చింది సమంత.
Read Also : Manchu Lakshmi అవన్నీ ఫేక్.. బెట్టింగ్ యాప్ కేసుపై మంచు లక్ష్మీ రియాక్ట్..
