NTV Telugu Site icon

Samantha: నా జీవితం అయిపోయింది.. ఇదే వరస్ట్ గా ఉంది

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ కాలం ఇచ్చే మందును తీసుకుంటుంది. ప్రకృతిలో మమేకం అవుతూ సరికొత్త లోకాన్నీ సృష్టించుకొంటుంది. ఇక ఆమె సినిమాలు వదిలేసినా అభిమానులను మాత్రం ఎప్పుడు వదలదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతే కాదు.. తాను రోజు చేసే పనులను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా రోజుల తరువాత సామ్.. తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో అభిమానుల ప్రశ్నలకు వీడియోలో సమాధానం చెప్పింది. ఇక మొదటగా తన అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంది. ఇక ఆ తరువాత తన నెక్స్ట్ ట్రిప్ ఆస్ట్రియా అని చెప్పుకొచ్చింది. ఒక అభిమాని.. తన తదుపరి చిత్రం ఎప్పుడు మొదలవుతుంది అని అడగ్గా .. ఇప్పుడప్పుడే కాదు అని, ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.

NTR: బాలకృష్ణతో ఎన్టీఆర్.. అది జరగదమ్మా.. ?

ఇక మరో అభిమాని.. స్కిన్ అంత క్లియర్ గా ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్నకు.. తన స్కిన్ ఇప్పుడు బాగోలేదని.. అది ఫిల్టర్ అని.. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకోవడం వలన తన స్కిన్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. ఇక చివర్లో ఇప్పటి జనరేషన్ టీనేజర్స్.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి మీకు ఇచ్చే సలహా ఏంటి అన్న ప్రశ్నకు.. ” నేను యంగ్ స్టార్స్ ను, టీనేజర్స్ ను చూసినప్పుడు.. వారు దగ్గర నేను ఎప్పుడు వినే మాట .. నా జీవితం అయిపోయింది .. ఇలాంటి వరస్ట్ పరిస్థితి నా జీవితంలోనే జరిగింది .. ఇలా చెప్పుకొస్తారు ఓరి దేవుడా.. కేవలం మీ జీవితంలోనే ఇలాంటి వరస్ట్ పరిస్థితి లేదు. ఇప్పుడే మీ జీవితం మొదలయ్యింది.. మీ జీవితంలో వచ్చే ఎన్నో ఇబ్బందులను మీరు ఎదుర్కోవవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీలో ఉన్న ధైర్యం మీకు తెలియకపోవచ్చు.. మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది. నా 25 ఏళ్ళ వయస్సులో నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టే .. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. జీవితంలో ముందుకు వెళ్ళాలి .. సంతోషంగా ఉండండి.. స్ట్రాంగ్ గా ఉండండి.. నెవెర్ గివ్ అప్..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.