లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తానని రచ్చ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా ఇచ్చిన రిజల్ట్‌కు అటు పూరి జగన్నాథ్, ఇటు రౌడీ.. ఇద్దరు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. అర్జెంట్‌గా తమకు ఒక హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఖుషి ట్రైలర్‌తో పాటు… సినిమాలోని మూడు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కాన్సర్ట్‌ను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా… హైదరాబాద్ HICC కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు.
ఖుషి సినిమా సాంగ్స్ అన్ని కూడా ఈ లైవ్‌లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు. ఇదే వేదిక పై మరో రెండు పాటలని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండతో పాటు సమంత కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మధ్య సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న సినిమాల కోసం అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసింది. దీంతో ఖుషి సినిమా ప్రమోషన్స్‌కు అమ్మడు వస్తుందా? రాదా? అనుకున్నారు కానీ ఇప్పుడు సామ్ ‘ఖుషి’ ప్రమోషన్స్ కోసం 15 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ, సమంత ప్రమోషన్స్ ఖుషి సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేయడం గ్యారెంటీ. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ నుంచే సమంత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుందని అంటున్నారు. దీంతో సామ్ ఫ్యాన్స్ ఫుల్ ‘ఖుషి’ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ తర్వాత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికాకు వెళ్లనున్నట్టు సమాచారం.
