Site icon NTV Telugu

‘శకుంతల’కు ‘శాకుంతలం’ టీమ్ వీడ్కోలు

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు టైటిల్ పాత్రధారిణి సమంతకు కూడా సెండాఫ్‌ ఇచ్చింది. ఇక తన నటనను వెండితెరపై చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ తో పాటు నిర్మాతలు ట్వీట్ ద్వారా తెలియచేశారు.

సమంతతో వర్క్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన నీలిమ గుణ సమంతను అమైజింగ్ టాలెంట్ ఉన్న కంప్లీట్ ఉమెన్ అని అన్నారు. ఇందులో దుశ్యంతునిగా దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, మేనకగా మధు నటించగా గౌతమి, కబీర్ బేడి, వర్షిణి సుందర్ రాజన్ ఇతరపాత్రలను పోషించారు. కెనడా, హాంగ్ కాంగ్, చైనాలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరపనున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version