Site icon NTV Telugu

Samantha: సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత – నచ్చిన పాట పేరుతోనే!

Samantha

Samantha

Samantha Starts her Own Production House Tralala: పలువురు హీరోలు, హీరోయిన్లలానే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దానికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సమంత తన అన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నా, కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా పిక్చర్స్ లక్ష్యం అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే ప్లాట్‌ఫాం ఇది.’ అని సమంత పేర్కొన్నారు. అలాగే ఈ నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా ఆ,ఏ వివరించారు.

Samantha : దటీజ్ సమంత సమంత.. అనాధ పిల్లలకు హాయ్ నాన్న స్పెషల్ స్క్రీనింగ్

తన చిన్నప్పుడు విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఇక ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించినందుకు గాను సమంతకు ఎంతో మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు కూడా తెలిపారు. టాలీవుడ్ సినిమాలతో హీరోయిన్ గా మారి కోలీవుడ్, బాలీవుడ్… ఇలా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న సమంత… నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ అయ్యారు. ఇక సమంత హాయ్ నాన్న సినిమాను హైదరాబాద్ ఏఎంబీ థియేటర్ లో వీక్షించారు. తాను భాగస్వామిగా ఉండే ప్రత్యూష ఫౌండేషన్ పిల్లలకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా వారితో కలిసి ఆమె ఈ సినిమాను వీక్షించారు. ఇక అక్కడి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version