Site icon NTV Telugu

Samantha : సమంత ‘శుభం’ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..

Shubham

Shubham

Samantha : స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. ఆమె స్థాపించిన ట్రా లా లా బ్యానర్ మీద శుభం సినిమాను నిర్మించింది. ఈ మూవీ మే9న థియేటర్లలోకి రాబోతోంది. ప్రవీణ్‌ కండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రియ, చరణ్‌, షాలిని, శ్రావణి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా ‘జన్మ జన్మల బంధం’ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్లు అన్నీ కనిపించాయి.
Read Also : Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..

ఇందులో సమంత కూడా ఎంగేజింగ్ చేస్తూ స్టెప్పులు వేసింది. ఈ వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ బాగానే ఉంది. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా నిర్వహిస్తున్నారంట. సమంత దగ్గరుండి మరీ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసంది. దాదాపు ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను రూ.3కోట్ల లాభాలు ఆల్రెడీ తెచ్చిపెట్టాయంటున్నారు.
Read Also : India Pak War: యుద్ధం వస్తే 4 రోజుల్లోపే పాకిస్తాన్ పని ఖతం.. ఆ దేశంపై ఉక్రెయిన్ ఎఫెక్ట్..

Exit mobile version