NTV Telugu Site icon

Shakuntalam Trailer: అవమానాన్ని ఏ ప్రేమ మరిపించలేదు…

Shakuntalam

Shakuntalam

లేడీ సూపర్ స్టార్ సమంతా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. శాకుంతలం రిలీజ్ కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ‘శాకుంతలం’ ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చేశారు. కాళిదాసు రాసిన ‘శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంతా టైటిల్ రోల్ ప్లే చేసింది, ఆమె భర్త ‘దుష్యంత’ పాత్రలో ‘దేవ్ మోహన్’ నటించాడు.

కథానుసారం ‘విశ్వామిత్రుడు, మేనక’ల కూతురు అయిన శకుంతల కొన్ని కారణాల వలన ‘కన్వ మహర్షి’ ఆశ్రమంలో జీవిస్తూ ఉంటుంది. ‘ప్రియంవద’, ‘అనసూయ’ అనే ఇద్దరు మహిళలు శకుంతలకి తోడుగా ఉంటారు. ఒక రోజు ‘దుష్యంత మహారాజు’ వేట కోసం ‘కన్వ మహర్షి’ ఆశ్రమం ఉన్న అడవుల్లోకి వస్తే, అక్కడ ఉన్న ఒక ముని ఆశ్రమ ప్రాంతంలో వేటాడ కూడదు అని రాజుని వారించి, దుష్యంత మహారాజుని ‘కన్వ మహర్షి’ ఆశ్రమానికి ఆహ్వానిస్తాడు. ఈ సమయంలో కన్వ మహర్షి ఆశ్రమంలో ఉండడు, ఆశ్రమంలో తిరుగుతూ ఉన్న దుష్యంత మహారాజుకి ‘శకుంతల’ తారస పడుతుంది. ఆమెని ఒక చిన్న ప్రమాదం నుంచి కాపాడిన రాజు, ఆమె అందానికి మైమరిచిపోతాడు. ఆ తర్వాత శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ప్రేమ పుడుతుంది. కొన్ని రోజులకి ఈ ఇద్దరూ గంధర్వ వివాహం చేసుకుంటారు. శకుంతల గర్భిణీగా ఉన్న సమయంలో దుష్యంతుడు, తన రాజ్య పాలన కోసం తిరిగి వెళ్ళిపోతాడు. భర్త ఆలోచనలతోనే రోజులు గడిపేస్తున్న శకుంతల, ఒకరోజు ‘దుర్వాస’ మహర్షి తన ముందుకి వచ్చినా పట్టించుకోక పోవడంతో… కోపంతో ఊగిపోయిన ‘దుర్వాస మహర్షి’, శకుంతలని తన భర్త మర్చిపోతాడు అనే శాపం విధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియంవద, అనసూయలు పాపా విమోచనా మార్గం గురించి దుర్వాస మహర్షిని ప్రాధేయ పడగా, “ప్రేమకి గుర్తుగా ఏదైనా వస్తువు చూపిస్తే అప్పుడు దుష్యంతుడికి శకుంతలా గుర్తొస్తుంది” అని చెప్తాడు.

ఈ విషయం తెలియని శకుంతల ఒకరోజు గౌతమీ అనే మహిళ సాయంతో దుష్యంతుడు ముందుకి వెళ్తుంది, అతను ఆమె గుర్తు పట్టక నిందిస్తాడు. తన ప్రేమకి గుర్తుగా పెట్టుకున్న ఉంగరం పోయింది అనే విషయం గ్రహించిన శకుంతల నిస్సహాయ స్థిలో ఉండిపోతుంది. దీంతో ఆకాశం నుంచి మేనక కిందకి దిగి తన కూతురు అయిన శకుంతలకి తీసుకోని తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన దుష్యంతుడు ఆశ్చర్యపోతాడు కానీ శకుంతల తన భార్యని గుర్తు పట్టడు. ఇంతలో దుష్యంతుడు రాజ్యంలోని ఒక జాలరి చేపల వేటకి వెళ్తే, అక్కడ వలలో పడిన ఒక చేప పిల్ల కడుపులో ఒక ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరాన్ని తీసుకోని అతను మార్కెట్ ని అమ్మడానికి వెళ్తే, అది చూసిన దుష్యంత రాజు సైనికులు, జాలరిని ఒక దొంగ అనుకోని రాజు ముందు తెస్తారు. ఇక్కడ తన ఉంగరాన్ని చూసిన దుష్యంతుడుకి శకుంతలతో జరిగిన వివాహం గుర్తొస్తుంది. గత గుర్తొచ్చిన దుష్యంతుడికి, ‘శకుంతల’ని ‘మేనక’ తీసుకోని వెళ్ళిపోవడం కూడా గుర్తొచ్చి దిగులు పడతాడు. వారసుడు లేకుండా మరణిస్తే తన రాజ్యం మరియు సంపద ఇతరుల పాలు అవుతుంది అని గుర్తించి మరింత దిగులు పడతాడు. దుష్యంతుడిని చూసి ‘అప్సర’, అతనికి సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇంతలోనే ఇంద్రుడి తరపున, దేవతల తరపున రాక్షకులతో యుద్ధం చెయ్యడానికి దుష్యంతుడు స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో దేవతల తరపున పోరాడి, వాళ్లని గెలిపిస్తాడు దుష్యంతుడు. ఈ యుద్ధం గెలిచి తిరిగి తన రాజ్యానికి వెళ్తున్న దుష్యంతుడు, ‘మరీచ మహర్షి’ ఉన్న ‘హిమకుట పర్వత’ సౌందర్యానికి ఆకర్షితుడు అవుతాడు.

తన రథాన్ని ‘హిమకుట’ పర్వతం పైన ఆపిన దుష్యంతుడు… అక్కడ ఒక బాలుడు, సింహానికి ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేది లెక్క పెడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆ బాలుడి తల్లి పేరు శకుంతల అని, అతను పురు వంశానికి చెందిన వాడు అని తెలుసుకుంటాడు. ఆ బాలుడు తన కొడుకు అని దుష్యంతుడు గుర్తించగానే శకుంతల ప్రత్యక్షం అవుతుంది. ఆమెని చూడగానే దుష్యంతుడు తన గతాన్ని మర్చిపోయిన విషయం చెప్పి, శకుంతలనని క్షమించమని అడుగుతాడు. ఆ బాలుడిని, దుష్యంతుడిని మరీచ మహర్షి ఆశీర్వదించి తిరిగి తమ రాజ్యానికి పంపిస్తాడు. ఆ బాలుడే ‘భరతుడు’ అతని పేరు పైన ‘భరత రాజ్యం’ ఏర్పడింది.

ఇది స్థూలంగా శాకుంతలం కథ. ఈ కథలో ‘దుర్వాస’ మహర్షిగా ‘మోహన్ బాబు’ నటించాడు. ట్రైలర్ లో గుణశేఖర్ చూపించిన విజువల్స్ మరియు గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవు కానీ బడ్జట్ పరంగా చూస్తే పర్వాలేదనే చెప్పాలి. కథలో విషయం ఉంది కాబట్టి ఒక మోస్తరు గ్రాఫిక్స్ ఉన్నా కూడా శాకుంతలం సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారు. ఇక ట్రైలర్ సమంతా లుక్ అండ్ అప్పీరెన్స్  నిజంగానే దేవకన్యలా అనిపిస్తుంది, దుష్యంతుడుగా దేవ్ మోహన్ కూడా చాలా బాగున్నాడు. శకుంతల స్నేహితుల్లో ఒకరిగా అనన్య నాగళ్ల నటించింది. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శేఖర్ వి జోసెఫ్ సినీమాటోగ్రఫి, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ టెక్నిక్స్, అశోక్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో సమంతా పాన్ ఇండియా మార్కెట్ లో తన లక్ ని టెస్ట్ చేసుకోకుంది.

Show comments