నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా వేగవంతం చేసింది యూనిట్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రచారాన్ని కూడా అంతటా భారీ స్థాయిలో నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నారు. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి సంభాషణలు రాయగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో ఫ్యాన్స్ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. లేకుంటే ఒక్కరోజు తేడాలో నాగచైతన్య, సమంత సినిమాలు విడుదల అయ్యేవి. ఇటీవలే విడాకులు తీసుకున్న ఇద్దరికీ ఇది ఇబ్బందిని కలిగించే అంశమే. సో ఇప్పుడా సమస్య తీరింది. మరి విడి విడిగా రాబోతున్న చై, సామ్ ఏ స్థాయి విజయాలను అందుకుంటారో చూడాలి.
Samantha : నాగచైతన్యతో గొడవ లేదన్న సమంత

Samantha Nagachaityana