Site icon NTV Telugu

Samantha: సైలెంట్‌ గా ముంబైకి షిప్ట్‌ అవుతున్న సమంత.. అందుకే వారికి నో?

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu Silently shifting to Mumbai: సౌత్ లో డిమాండ్ తగ్గిన హీరోయిన్స్ నార్త్ కి వెళ్లడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్. కొందరు అక్కడా ఇక్కడా మేనేజ్ చేస్తే మరికొందరు మాత్రం హిందీ ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా నటించి కెరీర్ లో మైలేజ్ కూడా పెంచుకుంటూనే అక్కడ స్థిరపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉన్న సామ్ మాత్రం రివర్స్ ఫార్ములాలో తెలుగు సినిమాలు వద్దు హిందీ సినిమాలే ముద్దు అంటూ కొత్త స్లోగన్ ని షురూ చేసిందని టాక్ వినిపిస్తోంది. సమంత టాలీవుడ్ లో చివరిగా ‘ఖుషి’ మూవీలో నటించింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు ప్రాజెక్టుకి సమంత సైన్ చేయలేదు.

Sasidavane : గోదారి అటు వైపో అంటున్న శశివదనే హీరో!

మాయోసైటిస్ జబ్బుకి రెస్ట్ తీసుకుంటోంది అంటూ మీడియాకి లీకులు ఇచ్చింది. చాలా మంది నిర్మాతలు తనని సంప్రదించినా దేనికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సౌత్‌ లో సమంతకి ఫుల్ డిమాండ్ ఉన్న సైలెంట్‌ గా ముంబై చెక్కేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రజెంట్ సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ సిటాడెల్. ఫారెన్ టెలివిజన్ షోకి ఇది ఇండియన్ వెర్షన్. ఇందులో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత వరుసగా హిందీ సినిమాలు చేసేలా సమంత పక్కా ప్లాన్ రెడీ చేసుకుందని టాక్ నడుస్తోంది. ప్రజెంట్ నార్త్ మేకర్స్ తో టచ్ లో ఉన్న సామ్ ముంబైలో ఉండేందుకు ఓ మంచి హౌస్ ని సెర్చ్ చేస్తుంది. బాలీవుడ్‌లో అయితే తన కెరీర్‌కు సరిపడే మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోందని అంటున్నారు. మొత్తానికి సౌత్ లో స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన సామ్ నార్త లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version